v23 5g: వివో వి23 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో కలర్స్ మారిపోయే ఫీచర్

With impressive camera COLORS CHANGING technology
  • వీ23 ధర రూ.29,900-34,990
  • వీ23 ప్రో ధర రూ.38,999-43,990
  • డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
చైనాకు చెందిన వివో తాజాగా విడుదల చేసిన వీ23 సిరీస్ ఫోన్లలో పలు కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ ఫోన్లతో ఎంతోకొంత కొత్తదనాన్ని అయితే యూజర్లు పొందుతారు.

వీ23 5జీ, వి23 ప్రో 5జీ అనే రెండు రకాలను వివో విడుదల చేసింది. వీటి ధరలు వివో వీ23 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.29,990. 12జీబీ, 256 జీబీ స్టోరేజీ ధర రూ.34,990. ఇక వీ23 ప్రో 5జీ 8జీబీ, 128జీబీ స్టోరేజీ ధర రూ.38,999. 12జీబీ, 256జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.43,990.

ఈ ఫోన్ల వెనుక భాగంలో ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ను కంపెనీ అమర్చింది. సూర్యకిరణాలు, ఇతర రూపాల్లో వచ్చే యూవీ కిరణాలు, లైటింగ్ ఈ ఫోన్ల పై పడినప్పుడు రంగులు మారుతూ కనిపిస్తుందని కంపెనీ ప్రకటించింది. రంగులు మార్చే ఫ్లోరైట్ గ్లాస్ డిజైన్ తో వచ్చిన తొలి ఫోన్ ఇదే.

డ్యుయల్ సెల్ఫీతో ఈ ఫోన్లు రావడం మరో ప్రత్యేకత. 50 మెగాపిక్సల్ ఐఆటో ఫోకస్ డ్యుయల్ సెల్ఫీ తో వస్తున్న ఫోన్ ఇదేనని వివో ప్రకటించింది. వీ23 5జీ వెనుక భాగంలో 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాగా ఉంటుంది. వీ23 ప్రో 5జీలో 108 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరాను ఏర్పాటు చేసింది. ఇక ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమన్సిటీ 1200 చిప్ సెట్ తో వస్తాయి. 90 హెర్జ్ ర్రీఫెష్ రేటు డిస్ ప్లే ఉంటుంది.
v23 5g
v23 pro 5g
colors change glass

More Telugu News