Chandrababu: ఇప్పుడు మా వాళ్ల పింఛన్లు తొలగిస్తున్నారు... రేపు మేం వస్తే మీ బంధువుల పింఛన్లు కట్!: చంద్రబాబు

Chandrababu warns volunteers
  • చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • కుప్పం నియోజకవర్గంలో రోడ్ షో
  • వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
  • వలంటీర్లు ఎక్కడికీ ఎగిరిపోరని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వృద్ధులకు పింఛన్లు తొలగిస్తున్నారీ దుర్మార్గులు అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తమ వాళ్ల పెన్షన్లు తొలగిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల సంగతి చూసుకుంటామని హెచ్చరించారు. వలంటీర్ల బంధువుల పెన్షన్లు కట్ చేస్తామని స్పష్టం చేశారు.

"ఈ ఊర్లో ఉండే వలంటీర్లూ మీరు ఇక్కడే ఉంటారు... ఎక్కడికీ ఎగిరిపోరు. బెదిరించొద్దు... మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం! వలంటీర్లను కూడా అడుగుతున్నా... ఈ వైసీపీ పాలనలో మీ బతుకులేమైనా బాగున్నాయా? మీకు రూ.5 వేలు ఇస్తూ, లక్ష రూపాయలు దోపిడీ చేస్తున్నారు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Chandrababu
Volunteers
Kuppam
Chittoor District
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News