Raja Singh: బండి సంజయ్ ని ఆపడం ఎవరి తరం కాదు: రాజాసింగ్

No one can stop Bandi Sanjay says Raja Singh
  • బండి సంజయ్ అంటే ఒక శక్తి
  • ప్రజల కోసం తొమ్మిది సార్లు జైలుకు వెళ్లారు
  • రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటే ఒక పేరు మాత్రమే కాదని... ఒక శక్తి అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ప్రజల కోసం తొమ్మిది సార్లు జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్ దని చెప్పారు. సంజయ్ ని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించుకుంటున్న ప్రతి సర్వేలో తన గ్రాఫ్ తగ్గుతోందనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల మద్దతు బండి సంజయ్ కి మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని అన్నారు. ఎనిమిదో నిజాం కేసీఆర్ ను బీజేపీ మట్టికరిపిస్తుందని చెప్పారు.
Raja Singh
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News