Pakistan: పాకిస్థాన్ లో నవ శకం.. సుప్రీంకోర్టు జడ్జిగా మహిళ!

Ayesha Malik to become Pakistan first ever woman supreme court judge
  • పాక్ సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఆయేషా మాలిక్ ఎంపిక
  • ఆయేషాను ఐదు ఓట్ల మెజార్టీతో ఆమోదించిన పాక్ జ్యుడీషియల్ కమిషన్
  • హార్వర్డ్ లా స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయేషా
పాకిస్థాన్ చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక మహిళ తొలిసారిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ ఆయేషా మాలిక్ నియమితులయ్యారు. చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ నిన్న ఐదు ఓట్ల మెజార్టీతో జస్టిస్ ఆయేషా మాలిక్ ను ఆమోదించింది. ప్రస్తుతం ఆమె లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

లాహోర్ లోని 'పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా'లో ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఆ తర్వాత లండన్ లోని హార్వర్డ్ లా స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం కరాచీలో న్యాయవాదిగా పని చేశారు. ఆ తర్వాత తన కెరీర్లో పలు జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్, హైకోర్టుల్లో సేవలందించారు. ఆమె ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
Pakistan
Supreme Court
Woman
Ayesha Malik
Judge

More Telugu News