Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్లో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన ఆర్మీ

encounter in jammu
  • జమ్మూ కశ్మీర్లోని బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్
  • ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం
  • మ‌రిన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సోదాలు
జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో భార‌త సైన్యం ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మ‌ట్టుబెట్టింది. ఉగ్రవాదులలో ఒకరిని శ్రీనగర్ కు చెందిన వసీమ్ గా గుర్తించిన‌ట్లు అధికారులు మీడియాకు వివ‌రించారు. ఉగ్ర‌వాదులు ఉన్నార‌న్న స‌మాచారంతో ఆ ప్రాంతంలో సైన్యం సోదాలు జ‌రుపుతుండ‌గా ఉగ్ర‌వాదులు దాడుల‌కు ప్ర‌య‌త్నించ‌డంతో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.

ఉగ్ర‌వాదులను మ‌ట్టుబెట్టిన అనంత‌రం ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, బుల్లెట్లతోపాటు పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ వెల్లడించారు. మ‌రిన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సోదాలు కొన‌సాగుతున్నాయి.
Jammu And Kashmir
army

More Telugu News