Pawan Kalyan: రష్యా నుంచి తిరిగొచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan returned from Russia
  • ఇంతకు ముందే రష్యాకు వెళ్లిన పవన్ భార్య, పిల్లలు
  • 'భీమ్లా నాయక్' వాయిదా పడటంతో రష్యాకు వెళ్లిన పవన్
  • అక్కడే క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్న జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్ రష్యా వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన వస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ టీషర్ట్, జీన్స్ లో ఆయన స్టైలిష్ లుక్ లో ఉన్నారు. పవన్ భార్య అన్నా లెజ్నెవా, పిల్లలు కలిసి ఇంతకు ముందే రష్యాకు వెళ్లారు. తన తాజా చిత్రం 'భీమ్లా నాయక్' విడుదల వాయిదా పడటంతో పవన్ కూడా రష్యాకు వెళ్లారు. అక్కడే భార్యాపిల్లలతో కలిసి క్రిస్మస్, న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు. వెకేషన్ ముగించుకుని ఆయన హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇక నుంచి ఆయన రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉంది.
Pawan Kalyan
Janasena
Tollywood
Russia

More Telugu News