Srikanth Bolla: బాలీవుడ్ నటుడు హీరోగా అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్

Biopic on blind industrialist Srikanth Bolla inspirational life
  • అంధుడైనా స్వయంశక్తితో ఎదిగిన శ్రీకాంత్ బొల్లా
  • బొల్లాంట్ ఇండస్ట్రీస్ తో ఉన్నతస్థాయికి చేరిన వైనం
  • తుషార్ హిద్రానీ దర్శకత్వంలో బయోపిక్
  • శ్రీకాంత్ బొల్లా పాత్రను పోషిస్తున్న రాజ్ కుమార్ రావ్
హైదరాబాద్ కు చెందని శ్రీకాంత్ బొల్లా ఓ అంధుడు. కంటిచూపు లేకపోయినా మేధాశక్తితో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించి కోట్లాది రూపాయల టర్నోవర్ సాధిస్తూ, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఓ అంధుడు అయినప్పటికీ ఎవరికీ తీసిపోని రీతిలో శ్రీకాంత్ బొల్లా ఎదిగిన తీరు ఇప్పుడు వెండితెర చిత్రంగా రూపుదిద్దుకోనుంది.

శ్రీకాంత్ బొల్లా బయోపిక్ నిర్మించేందుకు చాక్ అండ్ చీజ్ ఫిలిం ప్రొడక్షన్స్, టీ సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత భూషణ్ కుమార్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో శ్రీకాంత్ బొల్లా పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ పోషిస్తున్నారు. ఈ బయోపిక్ కు తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు.
Srikanth Bolla
Biopic
Blind
Industrailist
Bollant Industries
Raj Kumar Rao
Bollywood
Tollywood

More Telugu News