Chiranjeevi: మెగాస్టార్ సరసన మెరవనున్న శ్రుతిహాసన్!

Sruthi Haasan in Chiranjeevi movie
  • 'క్రాక్'తో దక్కిన హిట్టు
  • ముగింపు దశలో 'సలార్'
  • సెట్స్ పైకి బాలకృష్ణ మూవీ
  • చిరూ జోడీగా సెట్ చేస్తున్న బాబీ    
బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టిన శ్రుతిహాసన్, తెలుగు తెరకి కొంతకాలం పాటు దూరమైంది. ఆ తరువాత తన కెరియర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడింది. అందులో భాగంగా ఆమె చేసిన 'క్రాక్' సినిమా కలిసొచ్చింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెట్టింది.

అదృష్టం తలుపు తట్టినట్టుగా ప్రభాస్ 'సలార్' సినిమా నుంచి కూడా అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గోపీచంద్ - బాలకృష్ణ కాంబినేషన్లోని సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇక చిరంజీవి సినిమాకి కూడా సైన్ చేయడానికి ఆమె సిద్ధంగా ఉందనేది తాజా సమాచారం. చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ 'వాల్తేర్ వీర్రాజు' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ ను సంప్రదించారు. దాదాపు ఆమెనే ఖరారు అవుతుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Chiranjeevi
Sruthi Haasan
Valther Veerraju Movie

More Telugu News