Ram Gopal Varma: కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: రామ్ గోపాల్ వర్మ

I dont know who is Kodali Nani says Ram Gopal Varma
  • టికెట్ల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వర్మ
  • టికెట్ రేటును నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరని ప్రశ్న
  • నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని మాత్రమే
సినిమా టికెట్ల ధరను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి వర్మ పలు ప్రశ్నలు సంధించారు. సినిమా టికెట్ ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన నేరుగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమాకి, సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు... మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అని ఎద్దేవా చేశారు.

మరోవైపు వర్మ వ్యాఖ్యలపై మరో మంత్రి కొడాలి నాని కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ... 'ఏపీ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే... వాళ్లు చెపుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు' అని ట్వీట్ చేశారు. వర్మ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించాల్సి ఉంది.
Ram Gopal Varma
Nani
Tollywood
Kodali Nani
YSRCP

More Telugu News