శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో జేపీ నడ్డా సమావేశం
- బండి సంజయ్ అరెస్ట్
- ర్యాలీకి పిలుపునిచ్చిన బీజేపీ
- హైదరాబాద్ చేరుకున్న నడ్డా
- శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత
ఈ నేపథ్యంలో, నడ్డా ఎయిర్ పోర్టులోనే తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, రామచంద్రరావు, కాసం వెంకటేశ్వర్లు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు. నడ్డా రాకతో శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.