Jagan: పెండింగ్ నిధులు విడుదల చేయండి: నిర్మలా సీతారామన్ ను కోరిన సీఎం జగన్

AP CM Jagan met union finance minister Nirmala Sitaraman
  • సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ
  • రాష్ట్రానికి మరింత ఆర్థికసాయం చేయాలని వినతి
  • వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, వేంరెడ్డి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. భేటీ సందర్భంగా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి మరింత ఆర్థికసాయం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు. వచ్చే బడ్జెట్ లో పోలవరం, కేంద్ర సంస్థలకు నిధులు ఇవ్వాలని తెలిపారు.
Jagan
Nirmala Sitharaman
New Delhi
YSRCP
Andhra Pradesh

More Telugu News