Kesineni Nani: వంగవీటి రాధా ఆఫీసు వద్ద రెక్కీ నిర్వహించింది వీరే: కేశినేని నాని

Kesineni Nani visits Vangaveeti Radha
  • ఎన్టీఆర్, చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు
  • టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారే రెక్కీ నిర్వహించారు
  • రాధాకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తా
దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపైనా, టీడీపీ ఆఫీసుపైనా దాడి చేసిన వారే వంగవీటి రాధా కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఈరోజు వంగవీటి రాధా ఇంటికి కేశినేని నాని, నెట్టెం రఘురాం వెళ్లారు. రెక్కీకి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఒక సంపద అని చెప్పారు. వంగవీటి రాధా జాగ్రత్తగా ఉండాలని కేశినేని సూచించారు. రెక్కీ విషయాన్ని పోలీసులు సీనియస్ గా తీసుకోవాలని కోరారు. విజయవాడలో పాత రోజులు రాకుండా పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు. రాధా రక్షణ కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు. వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తున్న కొందరు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని నాని ఆరోపించారు. 
Kesineni Nani
Vangaveeti Radha
Telugudesam
Chandrababu

More Telugu News