John Abraham: జాన్ అబ్రహాంకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్

Actor John Abraham And Wife Priya Runchal Test Positive For Corona
  • కరోనా బారిన పడినట్టు వెల్లడించిన జాన్ అబ్రహాం
  • ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నామని వెల్లడి
  • అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరిన జాన్ అబ్రహాం
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో జాన్ అబ్రహాం, ఆయన భార్య ప్రియా రంచాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జాన్ అబ్రహాం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

మూడు రోజుల క్రితం తాను ఒక వ్యక్తిని కలిశానని... ఆయనకు కరోనా ఉందనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. తాజాగా తనకు, ప్రియాకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నామని, ఎవరినీ కలవడం లేదని చెప్పారు. తామిద్దరం రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పకుండా మాస్క్ ధరించాలని చెప్పారు.
John Abraham
Wife
Corona Virus
Bollywood

More Telugu News