Radhe Shyam Movie: విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన 'రాధేశ్యామ్' యూనిట్

As of now There is no change in the release plans of Radhe Shyam
  • 'రాధేశ్యామ్' రిలీజ్ ప్లాన్స్ లో ఎలాంటి మార్పు లేదు
  • జనవరి 14న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది
  • విడుదలకు సంబంధించి వస్తున్న రూమర్లను నమ్మొద్దు

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇప్పటికే వాయిదా పడింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' రిలీజ్ కూడా వాయిదా పడబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

''రాధేశ్యామ్' రిలీజ్ ప్లాన్స్ లో ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పు లేదు. జనవరి 14న విడుదల అయ్యేందుకు సినిమా సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు సంబంధించి వస్తున్న రూమర్లను నమ్మొద్దు' అని ట్విట్టర్ ద్వారా యూనిట్ తెలిపింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News