మమ్మల్ని గెలిపిస్తే 300 యూనిట్ల విద్యుత్ ఉచితం.. అఖిలేశ్ యాదవ్ హామీల వర్షం
- లక్నో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్
- రైతులకు కూడా ఉచిత విద్యుత్
- మేనిఫెస్టోలో చేరుస్తామన్న ఎస్పీ చీఫ్
- నేడు లక్నోలో పర్యటించనున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇటీవల గోవాలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ నేడు లక్నోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉందని భావించారు. అంతలోనే అఖిలేశ్ యాదవ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.