క్రిస్ గేల్ విన్నపాన్ని పట్టించుకోని వెస్టిండీస్ బోర్డు
- సొంత మైదానంలో చివరి టీ20 ఆడాలనుకున్న గేల్
- టీ20 జట్టుకు గేల్ ను ఎంపిక చేయని బోర్డు
- తీవ్ర నిరాశకు గురైన గేల్
ఇప్పటికే వన్డేలు, టెస్టులకు గేల్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ సందర్భంగా గేల్ మాట్లాడుతూ... తన సొంత మైదానమైన సబీనా పార్క్ లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెపుతానని అన్నాడు. అయితే విండీస్ బోర్డు టీ20 జట్టులో స్థానం కల్పించకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, తన భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.