Nayanthara: కాబోయే భర్తతో కలిసి న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార

Nayanatara celebrates new year with lover Vignesh Sivan
  • దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో నయనతార
  • న్యూఇయర్ ను దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్న జంట
  • ఇటీవలే 'రాకీ' చిత్రాన్ని నిర్మించిన ప్రేమ జంట
దక్షిణాది అగ్ర సినీ నటి నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరిద్దరూ కొత్త సంవత్సర వేడుకలను దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. బుర్జ్ ఖలీఫా వద్ద వీరు వేడుకలను జరుపుకున్నారు. సినిమాల విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి ఇటీవలే 'రాకీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇందులో వసంత్ రవి, భారతీరాజా జంటగా నటించారు. మరోవైపు 'కాతు వాకుల రెండు కాదల్' సినిమాతో విఘ్నేశ్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటిస్తున్నారు.
Nayanthara
Vignesh Sivan
Tollywood
Kollywood
New Year

More Telugu News