Samantha: సమంత వర్కౌట్లు చేస్తున్నది ఇందుకేనట!

Samantha is doing workouts to eat samosas
  • ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే సమంత
  • సమోసాలు తినడానికే వర్కౌట్లు చేస్తున్నాననే అర్థం వచ్చేలా ఫొటో షేర్ చేసిన వైనం
  • మన ఆహారాన్ని బట్టే మన శరీరం, ఆలోచనలు ఉంటాయని వ్యాఖ్య
సినీ నటి సమంత ఫిట్ నెస్ కు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తుందో అందరికీ తెలుసు. జిమ్ లో చమటలు చిందిస్తూ చేసే వర్కౌట్ల వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తుంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో సమంత ఓ ఫొటో షేర్ చేసింది. అంతేకాదు ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తాను వర్కౌట్లు చేయడానికి కారణం ఇదేనంటూ ఓ ప్లేటులో సమోసాలు ఉన్న ఫొటోను షేర్ చేసింది. సమోసాలు తింటే శరీరంలో కేలరీలు పెరుగుతాయనే సంగతి తెలిసిందే.

అందుకే సమోసాలు తినడానికి వర్కౌట్లు చేస్తూ కేలరీలను కరిగించుకుంటున్నాననే అర్థం వచ్చేలా ఆమె పేర్కొంది. అంతేకాదు మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలు, మన మనసు ఉంటాయనే ఒక కొటేషన్ ను కూడా పోస్ట్ చేసింది.
Samantha
Fitness
Workouts
Reason

More Telugu News