Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా 'గాలోడు' .. టీజర్ రిలీజ్!

Gaalodu Teaser Released
  • 'జబర్దస్త్' కామెడీ షోతో క్రేజ్
  • హీరోగా దొరకని సక్సెస్
  • మాస్ మూవీగా 'గాలోడు'
  • ముఖ్య పాత్రల్లో సప్తగిరి, పృథ్వీ 
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్న చిన్న పాత్రలను చేస్తూ హీరోగా మారాడు. హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడుగానీ .. అవి అంతగా ఆడలేదు. అలా అని చెప్పేసి సుధీర్ తన ప్రయత్నాలు మానలేదు.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాలోడు' రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు .. కానీ నేను ఈ రెండిటినీ నమ్ముకోను .. నన్ను నేను నమ్ముకుంటాను" అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది.

టైటిల్ చూస్తేనే ఇది పక్కా మాస్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. అందుకు తగినట్టుగానే విజువల్స్ ఉన్నాయి. మాస్ యాక్షన్ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. డిఫరెంట్ లుక్ తో సుధీర్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సప్తగిరి .. పృథ్వీ కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sudigali Sudheer

More Telugu News