South Africa: సెంచూరియన్ విజయాన్ని కోహ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూడండి!

 Virat Kohli Cheteshwar Pujara celebrate Centurion victory by dancing with hotel staff
  • సెంచూరియన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు
  • హోటల్ వద్ద డ్యాన్స్, మ్యూజిక్‌తో సిబ్బంది స్వాగతం
  • కాలు కదిపిన కోహ్లీ, పుజారా, అశ్విన్, మయాంక్  
సెంచూరియన్ టెస్టు విజయాన్ని భారత జట్టు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ టెస్టులో అద్భుత విజయాన్ని అందుకున్న కోహ్లీసేన సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో నిలిచింది.

ఇక మ్యాచ్ అనంతరం తాము బస చేసిన ఐరీన్ కంట్రీ లాడ్జ్‌కు చేరుకున్న భారత జట్టు టెస్టు విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంది. హోటల్ వద్ద బస్సు నుంచి కిందికి దిగిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. డ్యాన్స్, మ్యూజిక్‌తో హోటల్ సిబ్బంది వారికి స్వాగతం పలికారు.

కోహ్లీ, చటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్ హోటల్ సిబ్బందితో కాలు కదిపారు. ఉత్సాహంగా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా, అశ్విన్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. మీరు కూడా చూసేయండి.
South Africa
Centurion
Team India
Virat Kohli
Irene Country Lodge

More Telugu News