Junior NTR: ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: జూనియర్ ఎన్టీఆర్

At one moment I went into depression says Junior NTR
  • 18 ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చాను
  • ఆ తర్వాత కొన్ని చిత్రాలు పరాజయంపాలయ్యాయి
  • అప్పుడు మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను
  • అందులోంచి బయటకు తీసుకొచ్చింది రాజమౌళి
టాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్... ఒకానొక సమయంలో వరుస పరాజయాలను చవిచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అప్పటి దారుణ సమయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. 18 ఏళ్లకే తాను సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చానని... తాను నటించిన రెండో సినిమాకే స్టార్ డమ్ ను చవిచూశానని ఆయన చెప్పారు.

అయితే ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాలు పరాజయంపాలు కావడంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. తాను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యానని... ఈ సమయంలో ఏ పనీ చేయలేకపోయానని చెప్పారు. చాలా కష్ట సమయాన్ని అనుభవించానని... అయితే ఆ డిప్రెషన్ నుంచి తనను బయటకు తీసుకొచ్చింది దర్శకుడు రాజమౌళి అని తెలిపారు. కష్టకాలంలో తన వెంట నిలిచి, తనలోని నెగెటివ్ ఫీలింగ్స్ పోయేలా చేశారని చెప్పారు. తనను ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దింది కూడా రాజమౌళేనని అన్నారు.
Junior NTR
Rajamouli
Tollywood

More Telugu News