Kadapa: కడపలో ఎస్ఐ ఆత్మహత్య

SI in Kadapa suicide
  • ఏఆర్ ఎస్ఐ చంద్రారావు ఆత్మహత్య
  • ఆయనది శ్రీకాకుళం జిల్లా
  • కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం
కడపలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ ఎస్ఐ చంద్రారావు (25) ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. కడపలో ఒంటరిగానే ఉంటున్నారు. స్థానికుల ద్వారా ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక విచారణ చేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం అతని మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల వల్లే ఈయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa
SI
Suicide

More Telugu News