Revanth Reddy: ‘పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

revant reddy slams  kcr
  • పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో పెట్రోల్ ధర త‌గ్గింపు
  • లీటరుకు రూ.25 తగ్గించారు
  • మనది దేశంలోనే ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెబుతారు 
  • ఆయ‌న‌ ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించేది లేదంటోంది
తెలంగాణ సర్కారుపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పెట్రోలు ధరను లీటరుకు రూ.25 మేర తగ్గిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ప్రకటించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. తెల్లకార్డు ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల‌ యజమానులకు వచ్చేనెల 26 నుంచి ఈ అవకాశం కల్పిస్తున్నామ‌ని హేమంత్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి ధ‌నిక రాష్ట్రం తెలంగాణ‌లో ఆ ప‌ని ఎందుకు చేయ‌ట్లేర‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.

'పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.25 తగ్గించింది. మనది దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించేది లేదంటోంది. ఖజానా దివాళా తీసిందా? లేక ప్రజలను ‘పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?' అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
Revanth Reddy
Congress
TRS

More Telugu News