Corona Virus: ఒమిక్రాన్ విజృంభించినా సభలు, సమావేశాలు ఆపబోం.. వర్చువల్‌గా చేపడతాం: బీజేపీ

BJP Prepared for virtual rallies and meeting in assembly elections
  • దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సందిగ్ధం
  • వర్చువల్‌గా సభలు, సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని కారణంగా దేశంలో థర్డ్ వేవ్ తప్పదని, ఫిబ్రవరి నాటికి కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. కేసులు కనుక పెద్ద ఎత్తున వెలుగు చూస్తే రాష్ట్రాలన్నీ ఆంక్షల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇది ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఏం చేయాలన్న దానిపై బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.
 
ఒమిక్రాన్ కారణంగా ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి కనుక నిరాకరిస్తే తాము వర్చువల్‌గా ముందుకెళ్తామని బీజేపీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలోనూ తాము ఇలానే ముందుకెళ్లినట్టు గుర్తు చేసింది. వర్చువల్‌గానే సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ గజేంద్ర షెకావత్ తెలిపారు.
Corona Virus
Omicron
BJP
Assembly Elections

More Telugu News