Fariduddin: మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి... సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

Former minister Fariduddin died
  • కొంతకాలంగా ఫరీదుద్దీన్ కు అనారోగ్యం
  • ఆసుపత్రిలో గుండెపోటుకు గురైన వైనం
  • ఫరీదుద్దీన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన కేసీఆర్
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సాయంత్రం గుండెపోటుకు గురికావడంతో తుదిశ్వాస విడిచారు.

2004లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగానూ మండలిలో అడుగుపెట్టారు. పార్టీ సహచరుడి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మైనారిటీ నేతగా విశేష సేవలందించారని కొనియాడారు.
Fariduddin
Demise
Former Minister
CM KCR
TRS
Telangana
Andhra Pradesh

More Telugu News