CPI Ramakrishna: సోము వీర్రాజును ఇకపై 'సారాయి వీర్రాజు' అని పిలవాలేమో!: సీపీఐ రామకృష్ణ వ్యంగ్యం

CPI Ramakrishna satires in Somu Veerraju
  • మద్యం కారుచౌకగా అందిస్తామన్న సోము వీర్రాజు
  • రూ.50కే క్వార్టర్ సీసా ఇస్తామని వెల్లడి
  • తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ
  • సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుందని వ్యాఖ్యలు
తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని కారుచౌకగా అందిస్తామని, క్వార్టర్ బాటిల్ ను రూ.50కే ఇస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే  సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుగా ఉందని అన్నారు.

రాష్ట్రంలో కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని అనడం సోము వీర్రాజు పిచ్చికి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును ఇకనుంచి  'సారాయి వీర్రాజు'గా పిలవాలేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను చవకగా ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తామంటోందని రామకృష్ణ విమర్శించారు.
CPI Ramakrishna
Somu Veerraju
Liquor
BJP
Andhra Pradesh

More Telugu News