COVID19: నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 14 మంది విద్యార్థులకు పాజిటివ్

14 Students In Sri Chaitanya College Tested Positive For Covid
  • జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించిన అధికారులు
  • భయాందోళనలలో తోటి విద్యార్థులు
  • విద్యార్థులంతా హోం ఐసోలేషన్ లోకి
హైదరాబాద్ లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. నార్సింగిలోని సదరు జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. రెండు రోజులుగా చలి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు టెస్ట్ చేయగా.. కరోనా నిర్ధారణ అయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

నార్సింగి మున్సిపల్ అధికారులు వెంటనే అప్రమత్తమై కాలేజీలో శానిటేషన్ చేశారు. మిగతా విద్యార్థులను హోం ఐసోలేషన్ లో ఉంచారు. విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్ ఏమిటన్నది ధ్రువీకరించేందుకు వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు.
COVID19
Telangana
Hyderabad

More Telugu News