Bheemla Naik: ‘డీజే’తో న్యూ ఇయర్ జోష్ నింపనున్న ‘లాలా.. భీమ్లా’.. డీజే సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..!

DJ Version Of LaLa Bheemla Song To Be Released On Dec 31st Night
  • డిసెంబర్ 31 రాత్రి 7.02 గంటలకు విడుదల
  • ప్రకటించిన చిత్ర యూనిట్
  • ఫిబ్రవరి 25న విడుదల కానున్న సినిమా
‘లాలా.. భీమ్లా..’ అంటూ ఇప్పటికే సాంగ్ తో అదరగొట్టేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం రేకెత్తించేందుకు సిద్ధమైపోతున్నారు. న్యూ ఇయర్ జోష్ నింపేందుకు ‘డీజే’తో వస్తున్నారు. నూతన సంవత్సర వేడుకను మరింత సౌండింగ్ గా చేసుకునేందుకు ‘లాలా.. భీమ్లా..’ పాటకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ ‘డీజే’ వెర్షన్ ను రిలీజ్ చేయనుంది. డిసెంబర్ 31 రాత్రి 7.02 గంటలకు ‘లాలా డీజే’ పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే పవర్ ఫుల్ విలన్ గా రానా దగ్గుబాటి.. పవన్ కు ఎదురెళ్తున్నాడు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నాడు. తొలుత సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా విడుదలను.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల కోసం వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు.

Bheemla Naik
Pawan Kalyan
Rana Daggubati
Tollywood

More Telugu News