Sudheer Babu: మైత్రీ మూవీ మేకర్స్ చేతికి కృతి శెట్టి మూవీ!

Krithi Shetty in Aa Ammayi Gurinchi Meeku Cheppali
  • ఇంద్రగంటి నుంచి మరో లవ్ స్టోరీ
  • సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
  • త్వరలో రానున్న ఫస్టులుక్
ఇటీవల కాలంలో ఎక్కడ ఏ సినిమా మొదలవుతున్నా .. ఎక్కడ ఏ సినిమా విడుదలవుతున్నా మైత్రీ మూవీ మేకర్స్ వారి పేరే వినిపిస్తోంది. వారు ఎంచుకునే కథలు .. అవి సాధించే విజయాలు అలా ఉంటున్నాయి. 'పుష్ప' సినిమాతోను మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ వారు, తాజాగా మరో ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే ఒక సినిమా రూపొందుతోంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాణంలో మైత్రీవారు భాగస్వాములయ్యారు.

 ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'ఉప్పెన' .. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలతో హిట్ అందుకున్న కృతి శెట్టి చేస్తున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి త్వరలో ఫస్టులుక్ ను వదలనున్నారు.

 

Sudheer Babu
Krithi Shetty
Indragnati Movie

More Telugu News