Allu Arjun: జీవితంలో రుణపడి ఉంటాను అనే మాట కొంతమందికే వాడతాను: అల్లు అర్జున్

Allu Arjun gets emotional in Pushpa Thank You Meet
  • బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పుష్ప
  • హైదరాబాదులో థాంక్యూ మీట్
  • సుకుమార్ తన కెరీర్ ను ఉన్నతస్థాయికి చేర్చాడన్న బన్నీ
  • భావోద్వేగాలకు గురై కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్
పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాదులో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కెరీర్ లో దర్శకుడు సుకుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని వెల్లడించారు. తన కెరీర్ ఆరంభంలో వచ్చిన భారీ హిట్ ఆర్య చిత్రం సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిందని తెలిపారు. ఆర్య చిత్రం లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేనని పేర్కొన్నారు.

ఆ సమయంలో సుకుమార్ చిత్రం కాకుండా ఇంకో చిత్రం చేసుంటే తన జీవితం వేరే విధంగా ఉండేదని, ఆర్య చిత్రం చేయడంతో తన కెరీర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ వరకు ఎదిగిందని వివరించారు. జీవితంలో రుణపడి ఉంటాను అనే మాట కొంతమందికే వాడతానని అన్నారు.

"ఓ రైతుగా ఉన్న మా తాత గారు సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకోకపోతే మేమందరం ఇవాళ ఇండస్ట్రీలో ఉండేవాళ్లం కాదు. అందుకే రుణపడి ఉంటాను అనే మాట మా తాతయ్యకు వాడతాను, జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు వాడతాను, నన్ను మొదటి సినిమా నుంచి ప్రోత్సహిస్తున్న మా చిరంజీవి గారికి వాడతాను. ఆ తర్వాత ఆ మాట వాడేది సుకుమార్ గారికే.

'పరుగు' సమయంలో ఓ స్పోర్ట్స్ కారు కొన్నాను. దాని ఖరీదు రూ.85 లక్షలు. కొత్త కారు స్టీరింగ్ పై చేయిపెట్టి ఆలోచించాను... నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరని ఆలోచిస్తే మొదట సుకుమారే గుర్తొచ్చాడు. డార్లింగ్... నువ్వు లేకపోతే ఇవాళ నేను లేను" అంటూ సుకుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ మాటలు అంటున్నప్పుడు బన్నీ భావోద్వేగాలకు గురై కళ్లనీళ్లు పెట్టుకోగా, సుకుమార్ రెండు చేతుల్లో ముఖం దాచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. తనను స్టార్ ను చేసి స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మలిచి జాతీయస్థాయిలో నిలిపాడంటూ సుకుమార్ ను కొనియాడారు.
Allu Arjun
Sukumar
Pushpa
Thank You Meet
Arya
Tollywood

More Telugu News