Gautam Sawang: వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం: డీజీపీ గౌతమ్ సవాంగ్

DGP Gautam Sawang responds to Vangaveeti Radha comments
  • తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ రాధా వ్యాఖ్యలు
  • రాధా వ్యాఖ్యలను సీఎంకు నివేదించిన మంత్రి నాని
  • రాధాకు 2 ప్లస్ 2 సెక్యూరిటీ
  • పోలీస్ శాఖా పరంగా చర్యలు చేపట్టామన్న డీజీపీ
తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

ఇటీవల తన తండ్రి రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని... రాధా వ్యాఖ్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా, 2 ప్లస్ 2 భద్రత కల్పించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే, రాధా వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి నిర్దేశించారు. కాగా రాధా వ్యాఖ్యల నేపథ్యంలో తమకు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని విజయవాడ పోలీసులు అంటున్నారు.
Gautam Sawang
DGP
Vangaveeti Radha
Kodali Nani
CM Jagan

More Telugu News