Sukumar: 'పుష్ప' సినిమా కోసం పనిచేసిన కిందిస్థాయి టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రకటించిన సుకుమార్

Director Sukumar announces one lakh to every single technician who worked for Pushpa
  • ఈ నెల 17న రిలీజైన పుష్ప
  • బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న చిత్రం
  • హైదరాబాదులో పుష్ప యూనిట్ థాంక్యూ మీట్
  • లైట్ బాయ్ లు, ప్రొడక్షన్ సిబ్బందికి సుక్కు తియ్యని కబురు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 17న పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్రం యూనిట్ పలుమార్లు సక్సెస్ మీట్ లు నిర్వహించింది. తాజాగా హైదరాబాదులో పుష్ప యూనిట్ తమ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పేందుకు థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పుష్ప కోసం పనిచేసిన దిగువస్థాయి టెక్నీషియన్లకు సుకుమార్ తియ్యనికబురు చెప్పారు. లైట్ బాయ్ లు, సెట్ సిబ్బంది, ప్రొడక్షన్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించారు. తనను మళ్లీ నిలబెట్టిన చిత్రం పుష్ప అని సుకుమార్ భావోద్వేగాలకు గురయ్యారు. ఈ విజయం కోసం తాను ఎంతో శ్రమించానని, తన కష్టంలో సగభాగం భార్య తబితకు చెందుతుందని పేర్కొన్నారు. హైదరాబాదులో నిర్వహించిన ఈ థాంక్యూ మీట్ కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న కూడా హాజరయ్యారు.
Sukumar
Technicians
Pushpa
One Lakh
Thank You Meet
Allu Arjun
Rashmika Mandanna
Tollywood

More Telugu News