Air Asia: భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించిన స్పైస్ జెట్, ఎయిర్ ఏసియా

SpiceJet and AirAsia India offering discounts on air tickets
  • హాలిడే సీజన్ లో ప్రయాణికులకు ఆఫర్లు  
  • వన్ వే టికెట్ ధర రూ. 1,122
  • డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 31 వరకు బుకింగులు
హాలీడే సీజన్ లో ప్రయాణాలు చేసేందుకు ప్రయాణికులు జంకుతున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు స్పైస్ జెట్, ఏయిర్ ఏసియా ఇండియాలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్లు ప్రయాణికులను ఆకట్టుకుంటాయని సదరు సంస్థలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలో, వన్ వే టికెట్ ప్రారంభ ధరను రూ. 1,122గా స్పైస్ జెట్ ప్రకటించింది. ఆఫర్లు ప్రకటించిన రూట్లలో చెన్నై-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, జమ్ము-శ్రీనగర్ తదితరాలున్నాయి. డిసెంబర్ 27 నుంచి 31 వరకు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో వీరు ప్రయాణించవచ్చు.

ఎయిర్ ఏసియా ఇండియా విషయానికి వస్తే.. ఆ సంస్థ 'న్యూ ఇయర్, న్యూ ప్లేసెస్' ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థ కూడా చెన్నై-బెంగళూరు, చెన్నై-హైదరాబాద్ తదితర రూట్లలో ప్రారంభ టికెట్ ధరను రూ. 1,122గా ప్రకటించింది. డిసెంబర్ 27 నుంచి డెసెంబర్ 31 వరకు బుకింగులు చేసుకోవచ్చు. జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రయాణ తేదీలను నిర్ణయించుకోవచ్చు.
Air Asia
Spice Jet
Discounts

More Telugu News