Mangli: మంత్రి కుమార్తె రిసెప్షన్ లో మంగ్లీకి సెల్ఫీ తిప్పలు.. అసిస్టెంట్ పై చిందులు.. ఇదిగో వీడియో!

Singer Mangli Har Irked With Fans Try to Mob Her For Selfies
  • ఏపీలోని యర్రగొండపాలెంలో ఘటన
  • కార్యక్రమం అనంతరం ఎగబడిన అభిమానులు
  • ఇదేం పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంగ్లీ
ప్రముఖ సింగర్ మంగ్లీకి సెల్ఫీ ఇబ్బందులు ఎదురయ్యాయి. నిన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్తె రిసెప్షన్ వేడుక కోసం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు ఆమె వెళ్లింది. ప్రోగ్రామ్ అయ్యాక తిరిగి వెళ్లే క్రమంలో కొందరు యువకులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. వారి నుంచి తప్పించుకునేందుకు మంగ్లీ తిప్పలు పడింది. సెల్ఫీలు తీసుకోవడానికి ఇదా పద్ధతంటూ మండిపడింది.

ఈ క్రమంలో తన అసిస్టెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సెల్ఫీలు తీసుకున్న ఫోన్లు పగులగొట్టండంటూ మండిపడింది. బండి తియ్యి.. ఫోన్ చెయ్యిరా దరిద్రుడా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత అభిమానుల నుంచి తప్పించుకుని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

 
Mangli
Singer
Selfies
Tollywood

More Telugu News