Hero: విద్యుత్ సైకిళ్ల శ్రేణిలో మరో రెండు మోడళ్లు తీసుకువచ్చిన 'హీరో'

Hero introduced two new electric bicycles in Lectro brand
  • లెక్ట్రో బ్రాండ్ కింద ఈ-మౌంటెన్ సైకిళ్లు తీసుకువచ్చిన 'హీరో'
  • ఒక్కసారి చార్జింగ్ చేస్తే 35 కిమీ ప్రయాణం
  • ఎఫ్2ఐ మోడల్ ధర రూ.39,999
  • ఎఫ్3ఐ మోడల్ ధర రూ.40,999
దేశీయ సైకిళ్ల తయారీ దిగ్గజం హీరో రెండు కొత్త విద్యుత్ సైకిళ్లు తీసుకువచ్చింది. లెక్ట్రో బ్రాండ్ కింద హీరో విద్యుత్ ఆధారిత సైకిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ శ్రేణిలో తాజాగా ఈ-మౌంటెన్ బైక్స్ ఎఫ్2ఐ, ఎఫ్3ఐ మోడళ్లను నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ సైకిళ్లను తమ అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కాకుండా, ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చని హీరో వర్గాలు తెలిపాయి.

వీటిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 35 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిలో 6.4 ఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. అత్యాధునిక బైక్ ల తరహాలో 4 ట్రావెల్ మోడ్స్ (పెడలిక్, థ్రాటిల్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్) ఇచ్చారు. ఈ రెండు మోడళ్లలో 7 స్పీడ్ గేర్స్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. ఇక, ధరల విషయానికొస్తే... ఎఫ్2ఐ సైకిల్ ధర రూ.39,999... ఎఫ్3ఐ ధర రూ.40,999 అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Hero
Electric Bicycles
Lectro
F2I
F3I

More Telugu News