Telugu Family: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలుగు టీనేజర్ల మృతి

Two Telugu teenagers died in road accident in Los Angeles
  • అమెరికా తెలుగు సమాజంలో విషాదం
  • గెట్ టుగెదర్ పార్టీకి హాజరైన తెలుగు కుటుంబం
  • తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అమెరికా తెలుగు సమాజంలో తీవ్ర విషాదం నెలకొంది. లాస్ ఏంజెలిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ టీనేజర్లు మృతి చెందారు. మరణించిన వారిని అక్షరా రెడ్డి, అర్జిత్ రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ తోబుట్టువులు. తెలంగాణలోని జనగామ జిల్లా బండ్లగూడెం (ఘనపురం మండలం)కు చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి రెండు దశాబ్దాల కిందట మెరుగైన అవకాశాల కోసం అమెరికా వెళ్లారు. కుటుంబంతో కలిసి లాస్ ఏంజెలిస్ లోనే స్థిరపడ్డారు.

భార్య రజిత, కుమార్తె అక్షరా రెడ్డి, కుమారుడు అర్జిత్ రెడ్డిలతో కలిసి ఈ నెల 18న తెలుగు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, అక్షరా రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తండ్రి రామచంద్రారెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం విషమ పరిస్థితి నుంచి గట్టెక్కినట్టు తెలిసింది.
Telugu Family
Road Accident
Death
Los Angeles
USA
Telangana

More Telugu News