Chiranjeevi: 'పుష్ప' చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి... సుకుమార్ కు అభినందనలు

Chiranjeevi watched Pushpa and appreciated director Sukumar
  • ఈ నెల 17న 'పుష్ప ది రైజ్' విడుదల
  • బాక్సాఫీసు వద్ద వసూళ్ల హవా
  • 'పుష్ప' చిత్రాన్ని ఎంజాయ్ చేసిన చిరంజీవి
  • బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారంటూ కితాబు
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం 'పుష్ప ది రైజ్'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని సెంటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలివారం రూ.229 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది.

కాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా 'పుష్ప' చిత్రాన్ని వీక్షించారు. 'పుష్ప' చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించింది. 'పుష్ప ది రైజ్' చిత్రంలోని ప్రతి ఘట్టాన్ని చిరంజీవి ఎంతో ఆస్వాదించారని తెలిపింది. దర్శకుడు సుకుమార్ ను చిరంజీవి అభినందించారని, బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారంటూ కొనియాడారని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 
Chiranjeevi
Pushpa
Sukumar
Allu Arjun
Tollywood

More Telugu News