Revanth Reddy: నా ఇంటికి వచ్చే అన్ని దారులను పోలీసులు చుట్టుముట్టారంటూ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి

All roads leading to my house surrounded by the police says Revanth Reddy
  • ఈరోజు ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహిస్తానని చెప్పిన రేవంత్
  • ఈ  ఉదయాన్నే రేవంత్ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు
  • ఇంటి చూట్టూ బారికేడ్ల ఏర్పాటు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దీంతో, ఈ ఉదయాన్నే ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఆయన బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'తెలంగాణ పోలీసులకు సుస్వాగతం. నా ఇంటికి వచ్చే అన్ని దారులను పోలీసులు చుట్టుముట్టారు. ప్రభుత్వం దేనికి భయపడుతోంది? ఎందుకు భయపడుతోంది?' అని ప్రశ్నించారు. దీంతోపాటు అన్ని దారుల్లో పోలీసులు మోహరించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

  • Loading...

More Telugu News