Nani: సినిమా టికెట్ల అంశంపై మరోసారి స్పందించిన హీరో నాని

Hero Nani once again reacts over cinema tickets issue
  • ఏపీలో సినిమా టికెట్ ధరల రగడ
  • ఇటీవల నాని వ్యాఖ్యలు
  • భగ్గుమన్న ఏపీ మంత్రులు
  • తన అభిప్రాయాలు చెప్పానన్న నాని
  • తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారని ఆరోపణ
టాలీవుడ్ హీరో నాని ఇటీవల సినిమా టికెట్ల అంశంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. తన వ్యాఖ్యల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై నాని తాజాగా స్పందించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయాలు వెల్లడించానని, కానీ తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారని ఆరోపించారు.

సమస్య ఉందన్నది నిజం అని, సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకమవ్వాలని నాని అభిప్రాయపడ్డారు. కానీ టాలీవుడ్ లో ఐక్యత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలోనే అందరూ ఏకతాటి పైకి వచ్చుంటే బాగుండేదని పేర్కొన్నారు.
Nani
Cinema Tickets
Andhra Pradesh
Vakeel Saab
Tollywood

More Telugu News