Team India: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్
- సెంచురియన్ లో నేడు తొలి టెస్టు ఆరంభం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- లంచ్ వేళకు టీమిండియా స్కోరు 83/0
సెంచురియన్ లో దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు లంచ్ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 46, కేఎల్ రాహుల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. విదేశీ పర్యటనల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం ఎంత కీలకమో తెలియంది కాదు.
ఈ నేపథ్యంలో, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మయాంక్, రాహుల్ నిలకడగా ఆడుతూ, తొలి ఇన్నింగ్స్ కు పటిష్ట పునాది వేశారు.