APCC President: ఏపీసీసీ అధ్యక్షుడి రేసులో ముగ్గురు నేతలు!

3 leaders in APCC president race
  • కసరత్తును పూర్తి చేసిన ఏపీ పార్టీ ఇంఛార్జీ ఉమన్ చాందీ
  • పలువురు కీలక నేతల అభిప్రాయాలను తీసుకున్న చాందీ
  • రేసులో చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్షకుమార్
ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయింది. అధ్యక్షుడి ఎంపిక కోసం ఏపీ ఇంఛార్జీ ఉమన్ చాందీ పలువురు రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఏపీ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాలు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు.

ముఖాముఖి సమావేశాలతో అందరి అభిప్రాయాలను ఉమన్ చాందీ తీసుకున్నారు. అధ్యక్షుడి రేసులో చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్షకుమార్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరి ముగ్గురిలో ఒకరికి ఏపీసీసీ అధ్యక్ష భాధ్యతలు దక్కనున్నాయి. జనవరి మొదటి వారంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదికను అందించనున్నారు. ఉమన్ చాందీ బృందం సంప్రదించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులు కూడా ఉన్నారు.
APCC President
New President
AP Congress

More Telugu News