Andhra Pradesh: క్రిస్మస్ పండుగ మాత్రమే కాదు.. మనిషిని సన్మార్గంలో నడిపించే దైవిక భావన: జగన్

AP CM Jagan and Opposition leader Chandrababu wishes On christmas
  • తెలుగు ప్రజలకు జగన్, చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు
  • జీసస్ తన జీవితం ద్వారా ఇచ్చిన సందేశం గొప్పదన్న జగన్
  • శాంతి, సంతోషాలకు క్రిస్మస్ చిహ్నమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మిస్ పండుగ మాత్రమే కాదని, మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన భావన అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులపైన క్షమాగుణం చూపించడం వంటివి జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని జగన్ పేర్కొన్నారు.

అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. క్రీస్తు జన్మదినం శాంతి, సంతోషాలకు చిహ్నమని పేర్కొన్నారు. ఏసు దీవెనలు ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. జీసస్ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రజల జీవితాల్లో నెలకొన్న బాధలు తొలగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆయనను వేడుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కోరారు.
Andhra Pradesh
Jagan
Chandrababu
Christmas

More Telugu News