Ohio State University: జంతువుల్లోనూ వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. అమెరికాలో 129 తెల్లతోక జింకలకు వైరస్

white tailed deers in us infected with corona

  • జనవరి-మార్చి మధ్య 360 జింకల నుంచి స్వాబ్స్ సేకరణ
  • మనుషుల నుంచే వీటికి వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానం
  • జింకలు సార్స్‌కోవ్-2 రిజర్వాయర్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిక

అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విరుచుకుపడుతున్న వేళ ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం వెలుగుచూసింది. ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్లతోక జింకలకు వైరస్ సంక్రమించినట్టు తేలింది. మొత్తం 129 జింకలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మనుషుల ద్వారానే వైరస్ వాటికి సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య ఒహాయోలోని తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్లతోక జింకల నుంచి నమూనాలు సేకరించారు. వీటిని పరీక్షించగా 129 జింకలకు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అంతేకాదు, అడవి జింకలు సార్స్ కోవ్-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News