Inter: తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ పాస్... సర్కారు ప్రకటన

Telangana govt announces failed Inter first year students will be passed
  • ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వెల్లడి
  • 51 శాతం మంది ఫెయిల్
  • పలువురు విద్యార్థుల ఆత్మహత్య
  • విద్యార్థి సంఘాల ఆందోళనలు
  • సర్కారు దిద్దుబాటు చర్యలు
ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి కాగా, 51 శాతం మంది ఫెయిల్ కావడం పట్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితాలతో వేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా, భగ్గుమన్న విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు.
Inter
Students
Pass
First Year
Telangana

More Telugu News