Vadivelu: హాస్యనటుడు వడివేలుకు కరోనా పాజిటివ్

Actor Vadivelu has tested positive for Covid
  • సినిమా పనుల మీద ఇటీవల లండన్ వెళ్లిన వడివేలు
  • తిరిగి వచ్చిన తర్వాత కోవిడ్ లక్షణాలు
  • చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్ లో చేరిన వడివేలు
ప్రముఖ తమిళ సినీ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. వెంటనే ఆయన చెన్నైలోని రామచంద్రా ఆసుపత్రిలో చేరారు. 'నాయి శేఖర్ రిటర్న్స్' అనే సినిమాకు లోకేషన్ల, ఆర్టిస్టుల ఎంపిక కోసం వడివేలు, డైరెక్టర్ సూరజ్, నిర్మాత లైకా ఉమేశ్ లండన్ వెళ్లారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వడివేలులో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనకు వైద్యులు కోవిడ్ టెస్టులను నిర్వహించారు.

మరోవైపు కరోనా బారిన పడిన కమలహాసన్ కూడా నవంబర్ 22న ఇదే రామచంద్రా ఆసుపత్రిలో అడ్మిట్ అయి కోలుకున్నారు. మరో హీరో విక్రమ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
Vadivelu
Tollywood
Kollywood
Corona Virus

More Telugu News