Bangladesh: బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగి 36 మంది సజీవదహనం!

36 dead in Bangladesh ferry fire accident
  • ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న నౌక
  • ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది
  • నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు ప్రయాణికులు
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగిన ఘటనలో 36 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలోని నదిలో ఈ తెల్లవారుజామున జరిగింది.

ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది ఉన్నారు.

ప్రాణాలు కాపాడుకోవడానికి వీరిలో చాలా మంది నదిలోకి దూకేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాదాపు 100 మందిని బారిసాల్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. నదిలోకి దూకినవారిలో కొందరు నీటిలో మునిగిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతోంది.
Bangladesh
Ferry
Fire Accident

More Telugu News