Ravindra Jadeja: "పుష్ప... పుష్పరాజ్... తగ్గేదే లే!" అంటూ డైలాగ్ చెప్పిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja says Pushpa dialogue
  • ఈ నెల 17న పుష్ప రిలీజ్
  • పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు
  • బాగా పాప్యులర్ అయిన 'తగ్గేదే లే' డైలాగ్
  • జడేజా తాజా వీడియో వైరల్
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం జాతీయస్థాయిలో అలరిస్తోంది. ఈ నెల 17న రిలీజైన పుష్ప హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది. కాగా, ఈ చిత్రంలో బన్నీ తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్ విపరీతంగా పాప్యులర్ అయింది.

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నోట కూడా ఈ డైలాగ్ వినిపించింది. "పుష్ప... పుష్పరాజ్... తగ్గేదే లే!" అంటూ జడేజా అదిరిపోయేలా డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడేజా టైమింగ్ కు బన్నీ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. జడేజా డైలాగ్ చెప్పిన వీడియోను పుష్ప యూనిట్ ట్విట్టర్ లో పంచుకుంది.
Ravindra Jadeja
Taggede Le
Pushpa
Allu Arjun

More Telugu News