Sushmita Sen: ప్రియుడితో మూడేళ్ల బంధం తెగిపోయిందన్న సుస్మితా సేన్

Sushmita Sen announces her breakup with Rohman Shawl
  • తన కంటే 16 ఏళ్ల చిన్నవాడితో సుస్మిత ప్రేమాయణం
  • డేటింగ్ చేస్తున్నామంటూ 2018లో ప్రకటన
  • తమ బంధం ముగిసిందంటూ నేడు వెల్లడి
  • ప్రేమ అలాగే ఉందని వివరణ
మాజీ విశ్వసుందరి, సినీ నటి సుస్మితా సేన్ తన వ్యక్తిగత విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రియుడు రోహ్మన్ షాల్ తో తన మూడేళ్ల బంధం ముగిసిందని ప్రకటించింది. 2018లో రోహ్మన్ షాల్ తో డేటింగ్ లో ఉన్నట్టు సుస్మిత అధికారికంగా వెల్లడించింది. ఆ సమయంలో వీరిద్దరూ కుటుంబపరమైన కార్యక్రమాల్లో, బహిరంగ ప్రదేశాల్లోనూ జంటగా కనిపించేవారు.

ఇటీవల కొంతకాలంగా సుస్మిత, రోహ్మన్ రిలేషన్ షిప్ పై ఊహాగానాలు బయల్దేరాయి. వీరిద్దరూ విడిపోనున్నారంటూ ప్రచారం జరిగింది. ఊహాగానాలు నిజమే అనేలా సుస్మిత నేడు ఇన్ స్టాగ్రామ్ లో తన బ్రేకప్ ను నిర్ధారించింది.

"స్నేహితులుగా మా ప్రస్థానం మొదలైంది. స్నేహితులుగానే ఉంటాం. మా మధ్యన బంధం ముగిసినా ప్రేమ మాత్రం అలాగే ఉంది" అని పేర్కొంది. భారత్ లో మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న రోహ్మన్ షాల్ వయసు 30 ఏళ్లు కాగా, సుస్మిత అతడికంటే 16 ఏళ్లు పెద్దది. ఇప్పుడామె వయసు 46 సంవత్సరాలు.
Sushmita Sen
Rohman Shawl
Breakup
Dating

More Telugu News