Rajinikanth: 'అన్నాత్తే' టెక్నీషియన్లకు బంగారు గొలుసులు బహూకరించిన రజనీకాంత్... ఫొటోలు ఇవిగో!

Rajinikanth felicitated Annaathe techinicians with gold chains
  • రజనీకాంత్ ప్రధాన పాత్రలో 'అన్నాత్తే'
  • నవంబరు 4న 'అన్నాత్తే' రిలీజ్
  • తెలుగులో 'పెద్దన్న'గా వచ్చిన చిత్రం
  • టెక్నీషియన్లను తన నివాసానికి ఆహ్వానించిన రజనీకాంత్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అన్నాత్తే' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో గణనీయమైన స్థాయిలో వసూళ్లు సాధించి రజనీ కెరీర్ లో మరో హిట్ గా నిలిచిపోయింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ సరసన ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్, నయనతార తదితరులు నటించగా, ఈ చిత్రం తెలుగులో 'పెద్దన్న' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా, 'అన్నాత్తే' చిత్రానికి పనిచేసిన ప్రధాన సాంకేతిక నిపుణులకు రజనీకాంత్ బంగారు గొలుసులు బహూకరించారు. వారిని తన నివాసానికి ఆహ్వానించిన రజనీకాంత్... సముచిత రీతిలో సత్కరించారు. రజనీ అంతటివాడి నుంచి కానుకలు అందుకున్న ఆ టెక్నీషియన్ల ఆనందం అంతాఇంతా కాదు.
Rajinikanth
Annaathe
Technicians
Gold Chains
Kollywood
Tamil Nadu

More Telugu News