Lavanya Tripathi: ఇది నా బెస్ట్ బర్త్ డే అంటున్న 'అందాల రాక్షసి'

Lavanya Tripathi Birthday Celebrations
  • 'అందాల రాక్షసి'తో పరిచయం
  • వరుసగా రెండు భారీ హిట్లు
  • ఇటీవల ఎదురైన ఫ్లాపులు
  • సరైన రోల్ కోసం వెయిటింగ్
లావణ్య త్రిపాఠి పేరు వినగానే 'అందాల రాక్షసి' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తరువాత ఆమె చాలా సినిమాలు చేసినప్పటికీ, ఆమె కెరియర్లో ఆ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోయింది. ఆ తరువాత ఆమె 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'భలే భలే మగాడివోయ్' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

తాజాగా ఆమె తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది. తన బర్త్ డే సందర్భంగా విషెస్ ను తెలియజేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పింది. తాను కేక్ కట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. "నేను ఇంతవరకూ జరుపుకున్న బర్త్ డేస్ లో ఇది నా బెస్ట్ బర్త్ డే. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ తన ఆనందాన్ని ఫ్రెండ్స్ తో పంచుకుంది.

ఇదిలావుంచితే, 'అర్జున్ సురవరం' తరువాత లావణ్య త్రిపాఠి కెరియర్లో హిట్ పడలేదు. ఈ మధ్య ఆమె చేసిన 'చావుకబురు చల్లగా' సినిమా నిరాశపరిచింది. దాంతో ఆమె సరైన రోల్ కోసం వెయిట్ చేస్తోంది. సినిమాల సంగతి అటుంచితే, కొన్ని వెబ్ సిరీస్ ల నుంచి ఆమెకి అవకాశాలు వెళుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు..
Lavanya Tripathi
Tollywood

More Telugu News